లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఓ బీజేపీ ఎంపీ, ఉత్తర మాల్దా అభ్యర్థి యువతి బుగ్గపై ముద్దు పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వైరల్ న్యూస్ లోకి వెళ్తే.. బెంగాల్‌లోని ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్మూ (Khagen Murmu) పోటీ చేస్తున్నారు. గత సోమవారం తన నియోజక పరిధిలోని శ్రిహిపుర్‌ గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఆయన ఓ యువతి చెంపపై ముద్దు పెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీనిపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టింది. అయితే ఈ ముద్దుపై ఎంపీ స్పందిస్తూ ఆమెను నా కుమార్తెలా భావించా. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటన్నారు. అలాగే ఆ యువతి కూడా ఎంపీకి మద్దతుగా నిలిచారు. ఆ ఫొటో తీసిన సమయంలో మా అమ్మానాన్నా కూడా అక్కడే ఉన్నారంటూ బదులిచ్చారు. వ్యాపారంలో తగాదాలు, నడిరోడ్డు మీద ఇద్దరిని కాల్చిన ప్రత్యర్థులు, ఒకరు మృతి, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)