మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు 38 స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ తొలి దఫాలో 15 మంది మహిళలుసహా 173 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం–1958 తొలగింపు డిమాండ్, రాష్ట్ర అభివృద్ధి, మహిళా సాధికారత, నిరుద్యోగం, అవినీతి అంశాలు ఓటింగ్‌పై సరళిపై ప్రభావం చూపనున్నాయి.2017లో జరిగిన ఎన్నికల్లో 60 సీట్లకుగాను బీజేపీ 21 చోట్ల నెగ్గింది. ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్, తృణమూల్‌ కాంగ్రెస్, ఒక స్వతంత్య్ర అభ్యర్థి మద్దతుతో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈసారి సుస్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఉవ్విళ్లూరుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)