అవిశ్వాస తీర్మానంపై లోక్‌స‌భ‌లో ఇవాళ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం మ‌ణిపూర్ వెళ్లాన‌ని, కానీ మ‌న ప్ర‌ధాని ఇంత వ‌ర‌కు ఆ రాష్ట్రానికి వెళ్ల‌లేద‌న్నారు. మ‌ణిపూర్ మ‌న దేశంలో లేద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ని రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. మ‌ణిపూర్ అన్న ప‌దాన్ని తాను వాడాన‌ని, కానీ వాస్త‌వం ఏంటంటే ఆ రాష్ట్రం ఇక లేద‌న్నారు. మ‌ణిపూర్‌ను రెండు రాష్ట్రాలుగా విభ‌జించిన‌ట్లు రాహుల్ పేర్కొన్నారు. మ‌ణిపూర్‌ను విభ‌జించి, విడ‌గొట్టిన‌ట్లు రాహుల్ అన్నారు. మ‌ణిపూర్‌ను చంపి భార‌త్‌ను హ‌త్య చేశార‌ని ఆరోపించారు. మీరే దేశ‌ద్రోహాలు అని రాహుల్‌ విమ‌ర్శించారు. మ‌ణిపూర్‌లో భార‌త‌మాతను హ‌త్య చేశార‌న్నారు. రాహుల్ మాట్లాడుతున్న స‌మ‌యంలో బీజేపీ స‌భ్యులు ఆయ‌న ప్ర‌సంగాన్ని అడ్డుకున్నారు.

Rahul Gandhi (Photo-ANI)

Here's ANI Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)