Vijayawada, OCT 02: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు (Dasara Celebrations) వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు అమ్మవారి (Saraswathi devi) జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దుర్గగుడికి (Durga temple) భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే బారులు తీరారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఈ ఒక్కరోజే అమ్మవారిని 2లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అధికారులు భావిస్తున్నారు. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీదేవిగా అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మను దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యల్లో విజయం సాధిస్తారని నమ్మకం. మూలానక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానజ్యోతిని వెలిగించే సరస్వతీదేవి దర్శనం.. అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకమని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఇంద్రకీలాద్రి: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి ఇంద్రకీలాద్రికి చేరుకున్న భక్తులు pic.twitter.com/NsBdeGCKMa
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) October 2, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)