ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం (Obesity)తో బాధపడేవారి సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటిందని తాజా అధ్యయనం వెల్లడించింది. వీరిలో పెద్దలేగాక, పిల్లలు, యువకులూ ఉన్నారని ‘ది లాన్సెంట్‌ జర్నల్‌’ కథనం పేర్కొంది. 1990 నుంచి తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఈ అధ్యయనం తెలిపింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా అధిక బరువుతో బాధపడుతుండగా వీరిలో 15.9 కోట్ల మంది చిన్నారులతో పాటు యువకులు ఉండగా, 87.9 కోట్ల మంది పెద్దలు ఉన్నట్లు లాన్సెంట్‌ తెలిపింది. 1990 నాటితో పోలిస్తే నాలుగురెట్లు పెరిగిందని అధ్యయనం తెలిపింది.

ఈ 30 రకాల జంక్ ఫుడ్స్ సిగరెట్‌ కన్నా ప్రమాదకరమైనవి, వెంటనే తినడం ఆపేయాలని హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు

ఎన్‌సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ (NCD-RisC), ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా లాన్సెంట్‌ ఈ అధ్యయనం నిర్వహించింది. పెద్ద వయసు మహిళల్లో ఊబకాయం రెండింతలు, పురుషులలో దాదాపు 3 రెట్లు పెరిగిందని పేర్కొంది.త్వరితగతిన చర్యలు తీసుకోకుంటే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా అధిక బరువుతో బాధపడతారని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ (World Obesity Federation) ఇప్పటికే హెచ్చరించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)