డెయిరీ మిల్క్ చాక్లెట్ పై తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ బిగ్ బాంబ్ పేల్చింది. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ చాక్లెట్స్ సురక్షితం కాదని నిర్ధారించింది. ఈ మధ్యే హైదరాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో బతికున్న పురుగు కనిపించడం సంచలనంగా మారింది. చిన్న పురుగు చాక్లెట్ రంగులోకి మారి తిరుగుతోంది.
దీనికి సంబంధించిన వీడియోను సామాజిక కార్యకర్త రాబిన్ జాచ్యూస్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ సూపర్‌మార్కెట్‌లో కొనుగోలు చేశానని, దానికి సంబంధించిన బిల్లును కూడా జత చేశానని చెప్పారు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపాయి. తాజాగా తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ డైరీ మిల్క్ చాక్లెట్ తినడం సురక్షితం కాదని నిర్దారించింది.
Here's News and Video
#Update The Telangana State Food laboratory has confirmed the Cadbury Chocolate (Roasted Almond) was
“UNSAFE TO CONSUME” they found WHITE WORMS & WEB!
Here’s the report of the 2 Cadbury chocolates purchased at Ratnadeep Retail.
It is perhaps high time that FMCG companies are… https://t.co/zPvNtKT3NJ pic.twitter.com/8JwBpNZdDg
— Robin Zaccheus (@RobinZaccheus) February 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)