Madurai, July 24: తమిళనాడులోని (Tamilnadu) మదురైలో (Madurai) ఘోరం జరిగింది. మారథాన్ (Marathan) పరుగులో పాల్గొన్న ఓ 20 ఏళ్ల బీటెక్ విద్యార్థి (B.Tech Student) గుండెపోటుతో (Heart Attack) మరణించాడు. ఆదివారం ఉదయం తమిళనాడు మంత్రులు ఉతిరమ్ 2023 బ్లడ్ డొనేషన్ మారథాన్ పరుగును ప్రారంభించారు. కల్లకురిచికి చెందిన యువకుడు దినేశ్ కుమార్ ఈ మారథాన్ ను విజయవంతంగా పూర్తి చేశాడు. అనంతరం, ఓ గంట పాటు కులాసాగానే ఉన్న యువకుడు తనకు ఒంట్లో ఏదో తెలియని ఇబ్బందిగా ఉందంటూ వాష్ రూంలోకి వెళ్లాడు. ఆ తరువాత బాత్రూమ్ లో పడి ఫిట్స్ వచ్చినట్టు గిలగిలా కొట్టుకోవడం ప్రారంభించాడు. దీన్ని స్నేహితులు గుర్తించి బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దినేశ్‌కు గుండెపోటు రావడంతో మరణించాడు.
Heart Attack Kills College Student in Tamil Nadu: 20-Year-Old Suffers Cardiac Arrest After Running in Blood Donation Awareness Marathon in Madurai, Dies#HeartAttackDeath #StudentDies #CardiacArrest #Marathaon #Madurai #TamilNaduhttps://t.co/Xmp8nEf3yh
— LatestLY (@latestly) July 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)