Newdelhi, Dec 2: కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌ లో (Ladakh) భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 8:25 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలు (Richter Scale)పై భూకంపం తీవ్రత 3.4గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అటు బంగ్లాదేశ్‌ లోని చిట్టగాంగ్‌ లో (Chittagong) భారీ భూకంపం వచ్చింది. శనివారం ఉదయం 9.41 గంటలకు చిట్టగాంగ్‌ లోని రామ్‌ గంజ్‌ లో భూమి కంపించింది (Earthquake). రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.6గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడికాలేదు.

Swine Flu in UK: మళ్లీ జంతువుల నుంచి మనుషులకు ఇంకో వైరస్, యుకెలో పందుల నుంచి మనిషికి స్వైన్ ఫ్లూ, ఇదే మొదటి కేసు అంటున్న వైద్యులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)