Newdelhi, Sep 22: ఒక్క ఏమరపాటుతో ముగ్గురు దొంగలు (Thieves) కస్టడీ (Custody) నుంచి తప్పించుకుని పారిపోయారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఝాన్సీ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు ఆ ముగ్గురు దొంగలను కోర్టుకు వ్యానులో తీసుకెళుతుండగా దొంగలు తప్పించుకున్నారు. మార్గమధ్యంలో పోలీసులు టీ కోసం వ్యానును ఆపారు. ఆ సమయంలో వాహనం తలుపులు లాక్ చేయడం మర్చిపోయారట. ఈ క్రమంలో వ్యానులోని ముగ్గురు నిందితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
Watch: టీ తాగేందుకు వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకున్న ఖైదీలు పరార్-Namasthe Telanganahttps://t.co/Nu9UTmGDSc
— Namasthe Telangana (@ntdailyonline) September 21, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)