Newdelhi, Nov 26: రిటైర్ కావాల్సిన 65 ఏళ్ల వయసులో ఓ వృద్ధుడు (Old Man) 1వ తరగతిలో చేరాడు. మునిమనవల వయసున్న చిన్నారుల మధ్య కూర్చుని అక్షరాలు నేర్వడం ప్రారంభించాడు. ఈ అసాధారణ ఘటన పాక్ లో (Pakistan) వెలుగు చూసింది. ఖైబర్ పాఖ్‌తున్ఖ్వా ప్రావిన్స్ కు చెందిన దిలావర్ (Dilawar) ఖాన్ ఇటీవల స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరాడు. జీవిత చరమాంకంలో ఓ కొత్త ప్రయాణం ప్రారంభించాడు. చిన్నతనంలో కుటుంబ బాధ్యతలు భుజాన పడటంతో దిలావర్ చదువుకు దూరమయ్యాడు. సంసార సాగరం ఈదుతూ జీవితమంతా నిరక్షరాస్యుడిగా గడిపేశాడు. అయితే, చదువుకు వయసుతో సంబంధం లేదని బలంగా నమ్మే దిలావర్, మలివయసులో తనకు దొరికిన తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మళ్లీ చదువుపై దృష్టి పెట్టాడు. వృద్ధుడి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
‘More power to you’: 65-year-old Pakistani man enrols in first grade, netizens cheer him onhttps://t.co/8YcnYW3UiS
— Express Trending 😷 (@ietrending) November 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)