Hyderabad, Jan 14: రుచి (Taste), నాణ్యతకు (Quality) మారుపేరైన భారత్ లో పండించే బాస్మతి బియ్యం (Basmati Rice) ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. ప్రపంచంలోని ఉత్తమ బియ్యంగా బాస్మతి కిరీటాన్ని దక్కించుకుందని ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రకటించింది. 2023-24 ఏడాదికి ప్రకటించిన అవార్డుల సందర్భంగా బాస్మతిపై ప్రశంసల వర్షం కురిపించింది. పొడవైన ధాన్యం బియ్యం రకానికి చెందిన బాస్మతిని భారత్, పాకిస్థాన్‌లలో పండిస్తుంటారు. బాస్మతి బియ్యం వండిన తర్వాత దాని నుంచి మంచి వచ్చే సుగంధ పరిమళం, రుచి, స్వల్పంగా ఉండే కారం దానికో ప్రత్యేకతను చేకూరుస్తాయి.
#Basmati gets title of 'best rice in world' for year 2023-24https://t.co/W4FxqRAVMe
— Economic Times (@EconomicTimes) January 13, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)