బెల్జియంలో షాకింగ్ ఘటన నివేదించబడింది. ఓ వ్యక్తి ఇతరుల కోసం ఏకంగా 8 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టం లేని వారు ఇతనికి కొంత పరిహారం ఇచ్చి వ్యాక్సిన్ వేయించుకోమన్నారు. వారి తరపున ఇతను ఏకంగా 8 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు. అయితే అతను తెలివిగా వారి ఐడీ కార్డులను ఇందుకు ఉపయోగించాడు.
బెల్జియంలోని వాలూన్ ప్రావిన్స్‌లో చార్లెరోయ్ నగరంలో నివసించే ఓ యువకుడు. వ్యాక్సిన్ తీసుకోకుండానే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కావాలనుకునే వ్యక్తులను నిందితుడు సంప్రదించాడు. అందుకు వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం రాగానే డబ్బు ఇచ్చిన వారికి సర్టిఫికేట్ ముట్టజెప్పేవాడు. ఇలా ఇప్పటివరకు 8 సార్లు కొవిడ్ తీకా తీసుకున్నాడు. 9వ సారి కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు టీకా కేంద్రానికి వచ్చి పట్టుబడ్డారు. నిందితుడితోపాటు వ్యాక్సిన్ తీసుకోవడానికి డబ్బు చెల్లించిన వారి పేర్లను బెల్జియం పోలీసులు వెల్లడించలేదు.
అతను 8 వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ అతని ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనపడలేదు. అయినప్పటికీ, అతను తన చర్యల నుండి ప్రయోజనం పొందిన వ్యక్తులతో పాటు ఫోర్జరీ కోసం విచారణకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఇతర వ్యక్తుల కోసం 8 సార్లు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
Man arrested in Belgium for getting the COVID-19 vaccine 8 times so he could get certificates for other people pic.twitter.com/dgwoJ9eU21
— The African Voice (@teddyeugene) December 23, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)