బీహార్ రాష్ట్రంలోని ఆరారియా జిల్లా జోకిహాత్ బ్లాక్‌లోని ఓ పాఠ‌శాల‌లోకి లుంగీ ధరించిన వ్యక్తి కత్తితో దర్శనమిచ్చాడు. 24 గంట‌ల్లో డ‌బ్బులు కాని, పిల్లలకు యూనిఫాం కాని ఇవ్వకుంటే చంపేస్తాన‌ని ఆ క‌త్తితో అక్క‌డున్న టీచ‌ర్ల‌ను బెదిరింపుల‌కు గురి చేశాడు. అయితే ఆ వ్య‌క్తి పిల్ల‌లు అదే పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు. ఆ పిల్ల‌లు బ‌ట్ట‌ల్లేకుండానే స్కూల్‌కు వెళ్తున్నారు. ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన యూనిఫాం కూడా రాలేదు. దీంతో తీవ్ర అస‌హ‌నానికి గురైన ఆ పిల్ల‌ల తండ్రి క‌త్తితో స్కూల్లోకి ప్ర‌వేశించి, హ‌ల్‌చ‌ల్ సృష్టించాడు.

త‌క్ష‌ణ‌మే స్కూల్ యూనిఫాం ఇవ్వాలి. లేదంటే 24 గంట‌ల్లో ఆ దుస్తుల‌కు కావాల్సిన డ‌బ్బులు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. అది కూడా జ‌ర‌గ‌ని ప‌క్షంలో మ‌ళ్లీ వ‌చ్చి క‌త్తితో పొడిచేస్తాన‌ని టీచ‌ర్ల‌ను బెదిరించాడు. ఇక అక్క‌డ గుమిగూడిన గ్రామ‌స్తులు ఆ వ్య‌క్తిని అటు నుంచి పంపించేశారు. ఆ వ్య‌క్తిని అక్బ‌ర్‌గా పోలీసులు గుర్తించారు. స్కూల్ ప్ర‌ధానోపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)