బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఓ వివాహ వేడుకలో డ్యాన్స్‌లు చేసి విమర్శల పాలయ్యాడు. ఈ మేరకు బీహార్ అసెంబ్లీలో భాగల్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గోపాల్ మండల్ ఫతేపూర్‌ గ్రామంలోని వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆయన అక్కడ ఒక యువతితో కలిసి డ్యాన్స్‌ చేయడమే కాకుండా ఫ్లయింగ్‌ కిస్‌లు ఇస్తూ డబ్బు విసరడం వంటి పనులు చేశాడు. అంతేగాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. దీంతో పార్టీ సభ్యలు గోపాల్‌కి చివాట్లు పెట్టడమే కాకుండా జనతాదళ్‌ పార్టీ గౌరవాన్ని దిగేజార్చేలా ప్రవర్తించకండి, పదవికి తగ్గట్టుగా ప్రవర్తించమంటూ మందలించారు.

కానీ గోపాల్‌ మాత్రం మ్యూజిక్‌ వింటూ ఆగలేనని, పైగా ఒక కళాకారుడి కళను ఎవరు ఆపలేరంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. ఐతే గోపాల్‌ ఈ విధంగా ప్రవర్తించడం తొలిసారికాదు. గతంలో కూడా ఓ వివాహ రిసెప్షన్‌లో బాలీవుడ్‌ పాటకి డ్యాన్స్‌ చేస్తూ విమర్శల పాలయ్యారు. అంతేగాదు ఆయన రైలు ప్రయాణంలో లోదుస్తులతో తిరుగుతూ వివాదస్పద వ్యక్తిగా వార్తల్లో నిలిచారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)