Newdelhi, Mar 4: డార్లింగ్ (Darling) అని పిలవడం కూడా లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు (Calcutta High Court) స్పష్టం చేసింది. డార్లింగ్ అనే పదం లైంగిక అర్థాన్ని కలిగి ఉందనీ, పరిచయం లేని మహిళను అలా పిలవడం కూడా వేధింపుల కిందకే వస్తుందని తెలిపింది. జనక్ రామ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ మీద ఇటీవల విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.   అసలు సంగతిలోకి వస్తే.. 2015లో అండమాన్ లో పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జనక్ రామ్ అనే వ్యక్తి ఓ లేడీ కానిస్టేబుల్‌ ను ఉద్దేశించి డార్లింగ్ అని పిలిచాడు. దీనిపై మండిపడిన లేడీ కానిస్టేబుల్.. అతని మీద కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన కోర్డు.. జనక్ రామ్‌ కు నెల జైలు శిక్ష విధిస్తూ పై వ్యాఖ్యలు చేసింది.

Varalaxmi Sarathkumar Engagement: 38 ఏళ్ల వ‌య‌స్సులో పెళ్లిపీట‌లెక్క‌బోతున్న తెలుగు లేడీ విల‌న్, నిశ్చితార్ధం ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్, ఇంత‌కీ పెళ్లికొడుకు ఎవ‌రంటే?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)