London, August 16: కొన్ని వార్తలు చదివితే, ముక్కున వేలేసుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఇదీ అలాంటి వార్తే. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి టెడ్డీబేర్‌లో దాక్కున్నాడు ఓ దొంగ. వివరాల్లోకి వెళ్తే.. మాంచెస్టర్ కు చెందిన 18 ఏళ్ల జాషువా డాబ్సన్ చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల ఓ కారును దొంగిలించాడు. పోలీసులు తనకోసం వెతుకుతుండటంతో భయపడ్డ డాబ్సన్ దాక్కోవడానికి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఐదు అడుగుల టెడ్డీబేర్‌ను కట్‌చేసి, అందులో కొంత కాటన్ ను తీసేసి అందులో కూర్చున్నాడు. సీసీ కెమెరాల్లో డాబ్సన్ కదలికలను గుర్తించిన పోలీసులు చివరకు అతని గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చి వెదకడం మొదలుపెట్టారు. టెడ్డీబేర్ శ్వాస తీసుకుంటున్న చప్పుడు రావడంతో అనుమానం వచ్చి దాన్ని కట్ చేసి చూశారు. అలా మనోడు దొరికిపోయాడు. ఆ టెడ్డీలో ఎలా పట్టావయ్యా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
మనోడు దాక్కున్న టెడ్డీబేర్ ఇదే చూసేయండి..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)