Newdelhi, Nov 5: ప్రధాని మోదీ (PM Modi) ‘ఉచిత్‌ రేషన్‌’ స్కీమ్‌ ను (Free Ration Scheme) పొడిగించనున్నట్టు తాజాగా ప్రకటించారు. పేదలకు మరో ఐదేండ్ల పాటు ఈ పథకాన్ని పొడిగించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదని ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్‌ గఢ్‌లోని దుర్గ్‌, మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు. ఉచిత రేషన్‌ పొడిగింపును ‘మోదీ గ్యారంటీ’గా ఆయన చెప్పుకొన్నారు. ఈ పథకం పొడిగింపు వల్ల 80  కోట్ల మందికి పేదలకు డబ్బు ఆదా ఆవుతుందని, వాటితో వేరే అవసరాలు తీర్చుకోవచ్చని అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)