Newdelhi, Nov 17: ఉచిత రేషన్‌ (Free Ration) పంపిణీ (ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన) పథకాన్ని మరో ఐదేండ్ల పాటు అమలుజేస్తామని ప్రధాని మోదీ (PM Modi) కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అయితే ఆయన మాటలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) తాజాగా ఓ ప్రకటన చేయడం వివాదాలకు దారితీసింది. ఉచిత రేషన్‌ పథకం అమలును ఏడాది పొడిగించామని, అది 2023 జనవరి 1తో మొదలైందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల సంబంధాల శాఖ తాజాగా ప్రకటించింది. అయితే ప్రధాని హామీకి కేంద్ర ప్రకటన విరుద్ధంగా ఉండటంతో ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధాని ప్రకటన ఉత్తదేనా అని నిలదీస్తున్నాయి. ‘ఉచిత రేషన్‌ కార్యక్రమాన్ని 2028 వరకు పొడిగిస్తున్నామని నవంబర్‌ 4న ప్రధాని మోదీ ప్రకటించారు. తాజాగా కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో అలా లేదు. అసలేం జరుగుతున్నది?’ అని కాంగ్రెస్‌ నాయకుడు జైరామ్‌ రమేశ్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు.

RBI New Rules on Loans: రుణాలపై కొత్త నిబంధనలు విధించిన ఆర్‌బిఐ, పర్సనల్‌ లోన్స్‌పై రిస్క్‌ వెయిట్ 25 పాయింట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)