Lucknow, March 6: ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఫరూఖాబాద్‌కు (Farrukhabad) చెందిన ఓ ఇన్‌స్పెక్టర్ రాసిన ఓ సెలవు చీటీ ఇప్పుడు సర్వత్రా వైరల్ గా (Viral) మారింది. దీనికి కారణం చీటీలో ఆయన పేర్కొన్న విషయాలే.. ఇంతకీ ఏం జరిగిందంటే.. సెలవులు దొరక్క పోవడంతో గత 22 ఏళ్లుగా తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లలేకపోయానని ఓ ఇన్‌స్పెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. హోలీ జరుపుకునేందుకు పుట్టింటికి తీసుకెళ్లనందుకు తన భార్య అలిగిందని, ఆమెకు నచ్చజెప్పి బుజ్జగించేందుకు 10 రోజుల సెలవు కావాలని ఎస్పీని కోరారు. ఈ లీవ్ లెటర్ చదివిన ఎస్పీ అశోక్ కుమార్ మీనా నవ్వు ఆపుకోలేకపోయారు. ఇన్‌స్పెక్టర్ కోరినట్టు కాకుండా ఐదు రోజుల సెలవులు మంజూరు చేసినట్టు తెలుస్తోంది.
22 साल से होली पर मायके नहीं गई पत्नी... इसलिए बहुत नाराज है... इंस्पेक्टर का छुट्टी के लिए पत्र वायरल pic.twitter.com/QvbdMDYupe
— Shravan Chauhan (@ShravanChauhanp) March 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)