సోషల్ మీడియాలో అనేక రకాలైన ఫేక్ వార్తలు దర్శనమిస్తున్నాయి. ఏది నమ్మాలో నమ్మకూడదో అని అయోమయంలో యూజర్లు ఉన్నారు. తాజాగా ఇండియన్ ఆయిల్ కంపెనీ వార్నింగ్ బెల్ అంటూ ఓ ఇమేజ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దీని ప్రకారం ఎండాకాలంలో మీ వాహనంలో పెట్రోల్ కాని డీజిల్ కాని పుల్ ట్యాంక్ చేసే పేలిపోతుందని ఇండియన్ ఆయిల్ కంపెనీ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఓ ఇమేజ్ వైరల్ అవుతోంది. దీనిపై కంపెనీ స్పష్టత నిచ్చింది. ఆ న్యూస్ ఫేక్ న్యూస్ అని మేము అలాంటి ప్రకటన ఇవ్వలేదని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. న్యూస్ వచ్చినప్పుడు నిజ నిర్థారణ చేసుకోవాలని ఇలాంటి రూమర్లను నమ్మవద్దని కోరింది.

Here's Viral Tweet

Here's Company Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)