సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మంచుకురిసే ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి దగ్గర... కోడి కోసమే అన్నట్లు చిన్న ఊయల ఉంది. గొలుసులతో ఉన్న ఆ ఉయ్యాలకు మధ్యలో చెక్కపీట లేదు. దానికి బదుుగా కోటి పట్టుకునేందుకు వీలుగా ఉండే పుల్ల ఉంది. ఆ పుల్లపై నిలబడిన కోడి... ఊయలపై అటూ ఇటూ ఊపుతూ తెగ ఆనందపడింది. మధ్యమధ్యలో కిందపడకుండా ఉండేందుకు మనం ఎలాగైతే చేతులతో గొలుసుల్ని పట్టుకుంటామో... అలా ఆ కోడిపెట్ట... తన రెక్కలతో గొలుసుల్ని టచ్ చేస్తూ ఊగింది. ట్విట్టర్‌లోమార్చి 27న పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 1.07 లక్షల మందికి పైగా చూశారు. దాదాపు 8వేల మంది లైక్ చేశారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)