Hyderabad, Oct 16: తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) మనవడు, కేటీఆర్ (KTR) తనయుడు హిమాన్షూ (Himanshu) తన తాత పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ పాలనతో ఎన్నో సమస్యలు అంతరించిపోయాయని చెప్పారు. ‘ఒక దశాబ్ది కాలంలోనే శతాబ్ది అభివృద్ధి’ అన్న నినాదం సీఎం కేసీఆర్ పాలనకు సరిగ్గా సరిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో పారదర్శకమైన, సమర్థవంతమైన, ప్రభావశీలమైన పాలన సాగుతోందని హిమాన్షూ చెప్పారు. అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి, సామాజిక అభ్యున్నతి చోటుచేసుకుందని పేర్కొన్నారు.
“ఒక దశాబ్ది కాలం లో శతాబ్ది అభివృద్ధి” a perfect statement about KCR Garu’s model of transparency, efficiency and effective governance which consists of cumulative growth in all sectors, be it industrial or agricultural revolution, economic development or social empowerment,… pic.twitter.com/Tv14KiH0fG
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) October 15, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)