సిటీ బస్సులో కండక్టర్‌ తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఎక్స్ వేదికగా వాపోయింది. మణికొండ నుంచి హిమాయత్‌ నగర్‌ వెళ్తున్న బస్సులో కండక్టర్‌ తనను అసభ్యంగా తాకినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌, మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ, షీ టీమ్స్‌, హైదరాబాద్‌ పోలీసులకు ఎక్స్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. కండక్టర్ కోసం హారన్ కొట్టిన బస్సు డ్రైవర్‌పై ప్యాసింజర్లు దాడి, బస్సులు నిలిపివేసి నిరసన చేపట్టిన డ్రైవర్లు, వీడియో ఇదిగో..

ఈ నెల 15న మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్నా. ఆధార్ కార్డు లేకపోవడంతో రూ. 30 డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నా. బస్సు రద్దీగా ఉండటంతో అదే అదనుగా భావించిన కండక్టర్‌ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను అనుచితంగా తాకాడు. 2 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు. అంకుల్ ఏం చేస్తున్నారంటూ గట్టిగా అరవగానే వెనక్కి వెళ్లిపోయాడు. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.ఈ ఫిర్యాదుపై టీజీఎస్‌ఆర్టీసీ స్పందించింది. ఫరూక్ నగర్ కండక్టర్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Here's Her Tweet

Here's TGSRTC Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)