Newdelhi, Jan 14: కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు మందులే లేవనుకున్న సమయంలో మలేరియా నయానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ (Hydroxychloroquine) (హెచ్‌సీక్యూ-HCQ) గోలీలు బాగా పని చేస్తున్నాయని, ఆ మందు సంజీవని అంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ప్రకటించారు. అయితే ఆ మందు సంజీవని కాదని, విషం అని పరిశోధకులు అధ్యయనం పేర్కొన్నది. అధ్యయనం ప్రకారం కరోనా సమయంలో ఆ మందును తీసుకోవడం వల్ల 17 వేల మరణాలు సంభవించాయని తేలింది. కరోనా నివారణలో అద్భుత ఔషధంగా ప్రచారం చేయబడిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు వినియోగం వల్ల మరణాల రేటు 11 శాతం వరకు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ పేర్కొనడం చర్చనీయాంశమైంది.
Meanwhile…Hydroxychloroquine use during COVID pandemic may have induced 17000 deaths, new study finds https://t.co/XsFVtXlTaQ
— RichardMedley (@RichardMedley50) January 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)