500 రూపాయల కరెన్సీ నోటు (currency note)పై స్టార్‌ (*) సింబల్‌ ఉంటే అవి నకిలీవంటూ సోషల్‌మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవమని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) స్పష్టం చేసింది. స్టార్‌ గుర్తు కలిగిన నోట్లు నకిలీవి అని జరుగుతోన్న ప్రచారం తప్పు అని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ (PIB Fact check) ‘ఎక్స్‌’లో తెలిపింది. ఈ తరహా రూ.500 నోట్లు 2016 డిసెంబర్‌ నుంచి మార్కెట్లో చెలామణిలో ఉన్నట్లు వెల్లడించింది.స్టార్‌ గుర్తు అంటే.. దాన్ని రీప్లేస్‌ చేసిన, పునర్‌ ముద్రించిన నోట్లు అని ఆర్‌బీఐ స్పష్టత ఇచ్చింది. ఆ నోట్లను సులువుగా గుర్తించడానికి ఈ స్టార్‌ సింబల్‌ను వినియోగిస్తున్నట్లు గతంలో పేర్కొంది. ప్రిఫిక్స్‌, సీరియల్‌ నంబర్‌ మధ్య ఈ స్టార్‌ గుర్తు ఉంటుందని తెలిపింది.ఇతర నోట్లలానే అవి కూడా చెల్లుబాటవుతాయని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం క్లారిటీ ఇచ్చింది. రూ. 65 వేలు గెలుచుకోవచ్చంటూ డిమార్ట్ ఆఫర్ లింక్ వైరల్, దాన్ని క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యక్ అవుతుంది జాగ్రత్త

Here's PIB Fact Check

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)