టీమ్‌ఇండియా స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ రాణించాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 157 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో విఫలమైన శుభ్‌మన్ గిల్ ఒక స్థానం దిగజారి మూడో స్థానానికి పడిపోగా.. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.
వన్డేల్లో బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే భారత్ తరఫున కుల్‌దీప్ యాదవ్ అత్యుత్తమంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. కేశమ్ మహరాజ్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా వరుసగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా ఎనిమిదో స్థానంలో ఉండగా.. మహ్మద్ సిరాజ్ ఐదు స్థానాలు దిగజారి పదో స్థానానికి పడిపోయాడు. భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ స్పెషల్ చిట్ చాట్.. వీళ్ల మధ్య ఏం జరుగుతుందంటూ ఆసక్తిగా అడుగుతున్న నెటిజన్లు (వీడియోతో)
Here's News
Asian domination of the ICC Men's ODI Batting Rankings continues as India and Sri Lanka batters make progress 👊https://t.co/oRsAIZaaMo
— ICC (@ICC) August 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)