మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్ స్టేషన్ యూట్యూబ్ జర్నలిస్ట్‌తో సహా కొంతమందిని స్టేషన్‌లోకి తీసుకెళ్లి వారిని చెడ్డీలపై నిలబెట్టడం అనేక విమర్శలకు తావిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) అధికార బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు గురు దత్ శుక్లా.. అనురాగ్ మిశ్రా అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో తనను బేదిరిస్తున్నాడని సిద్ధి కొత్వాల్ పోలీస్ స్టేషన్‌లో (MP police station) ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు విచారణలో భాగంగా నీరజ్ కుందర్ అనే థియేటర్ ఆర్టిస్టును అరెస్టు చేశారు. అయితే అతని అరెస్టుకు వ్యతిరేకంగా ఇంద్రావతీ నాట్య సమితికి చెందిన పలువురు సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. దీంతో విషయం తెలుసుకున్న కనిష్క్ తివారీ అనే యూట్యూబ్ జర్నలిస్టు తన కెమెరా మెన్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. నిరసనకారుల వద్ద సమాచారం సేకరిస్తున్నాడు.
దీంతో ఆగ్రహానికి లోనైన స్టేషన్ ఆఫీసర్ మనోజ్ సోనీ అందరినీ అరెస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా నిరసనకారులతోపాటు జర్నలిస్టును, కెమెరా మెన్‌ను బట్టలు తీసేయించి (Journalist, others forced to strip down ) చెడ్డీలపై స్టేషన్‌లో నిలబెట్టాడు. ఆ సమయంలో తీసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నది. దీంతో జర్నలిస్టు పట్ల అమర్యాదగా ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. దీంతో భోపాల్ ఏఎస్పీ ఆ సీఐని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
"We keep them in jail in this way so that they cannot commit suicide using their clothes," SHO Manoj Soni had said.
— ANI (@ANI) April 8, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)