Bengaluru, May 12: అది బెంగళూరులోని (Bengaluru) కాత్రిగుప్పె వాటర్ ట్యాంక్ ప్రాంతం. అక్కడి ఓ కూరగాయల షాప్ ముందు ఓ మహిళ ఫొటోను (Woman) ఆ దుకాణం యజమాని వేలాడదీశాడు. ఆ ఫోటోలోని మహిళ గుడ్లురుముతూ కోపంగా చూస్తున్నట్టు ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఫొటోను చూసిన వారంతా ‘వామ్మో ఏం చూపురా నాయనా!!’ అంటూ దెబ్బకు జడుసుకుంటున్నారు. అసలు ఫోటో ఎందుకు ఏర్పాటు చేశారా? అని ఆరా తీస్తే, షాప్ కు చెడు దృష్టి తగలకుండా ఉండేందుకే ఈ ఫొటో ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఏదిఏమైనా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Photo Of 'Angry' Woman At Bengaluru Vegetable Market Leaves Internet In Splits https://t.co/qpgGfhp1fS pic.twitter.com/kiFvrP4qGx
— NDTV (@ndtv) May 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)