ఓ వధువు భాంగ్రా డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో వధువు ఆయుషీ..వరుడితో కలిసి ఎంతో ఉత్సాహంగా భాంగ్రా డాన్స్ చేసింది. పెళ్లి దుస్తులు గోల్డ్ లెహంగాలో మెరిసిపోతూ.. అదిరిపోయే స్టెప్పులేసింది. డోలు చప్పుళ్లు, బీట్స్‌కి తగ్గట్టుగా డ్యాన్‌ చేసింది. కరెన్సీ నోటును చేతిలో పట్టుకొని చిందులేసింది. ఆ తర్వాత వరుడు కూడా ఆమెపై కరెన్సీ నోట్లను విసిరాడు. ‘సాధారణ వధువు కాదు. ఇంత కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంటుంది’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇప్పటి వరకు దీనిని 25 లక్షల మందికి పైగా చూడగా.. 1.68 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)