SBI Chocolates: ఇకపై ఈఎంఐ ఎగ్గొట్టేవారికి చాక్లెట్లు పంపనున్న ఎస్‌బీఐ.. వినూత్న ఆలోచనలో దిగ్గజ బ్యాంక్
రుణ ఎగవేతలను ఎదుర్కొనేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రుణ వాయిదా(ఈఎంఐ)ను ఎగ్గొట్టాలని చూస్తున్నవారికి చాక్లెట్స్ పంపి.. ఈఎంఐ సంగతి గుర్తుచేయనుంది.
Hyderabad, Sep 18: రుణ ఎగవేతలను ఎదుర్కొనేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ (SBI) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రుణ వాయిదా(ఈఎంఐ-EMI)ను ఎగ్గొట్టాలని చూస్తున్నవారికి చాక్లెట్స్ (SBI Chocolates) పంపి.. ఈఎంఐ సంగతి గుర్తుచేయనుంది. ఎస్‌బీఐ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ‘ఈఎంఐ ఎగ్గొట్టాలని భావిస్తున్న వారిని ఏఐ టెక్నాలజీతో ఫిన్ టెక్ సంస్థలు గుర్తిస్తాయి. వారి ఇండ్లకు వెళ్లి, చాక్లెట్ బాక్స్ ఇచ్చి.. ఈఎం`ఐ సంగతి గుర్తుచేస్తాయి’ అని ఎస్‌బీఐ అధికారి అశ్విన్ కుమార్ చెప్పారు.
#SBI is adopting a novel way to ensure timely repayments, especially by its retail borrowers, by greeting those likely to default on monthly installments with a pack of chocolates.https://t.co/uxZKD62133
— BQ Prime (@bqprime) September 17, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 18, 2023 08:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

