Climate Change Fish Weight Loss: వాతావరణ మార్పులతో సముద్రాల్లో చేపలకు ఆహారం కొరత.. బరువు తగ్గుతున్న చేపలు
వాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో ఆహారానికి పోటీ పెరిగిందని, తగినంత ఆహారం దొరక్కపోవడంతో చేపల బరువు తగ్గుతున్నదని తాజా అధ్యయనం తేల్చింది.
Newdelhi, Feb 29: వాతావరణ మార్పుల (Climate Change) కారణంగా సముద్రంలో ఆహారానికి (Food) పోటీ పెరిగిందని, తగినంత ఆహారం దొరక్కపోవడంతో చేపల బరువు (Fish Weight) తగ్గుతున్నదని తాజా అధ్యయనం తేల్చింది. పశ్చిమ ఉత్తర పసిఫిక్ సముద్ర జలాల్లో 2010 దశకంలో చేపల బరువు తగ్గుదల కనపడిందని పరిశోధకులు కనుగొన్నారు. వాతావరణ మార్పులతో సముద్ర జలాలు వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. దీని ఫలితంగా పోషకాహారంతో కూడిన చల్లటి జలాలు సముద్రం ఉపరితలానికి చేరటం లేదని, ఇది చేపలకు ఆహార లభ్యత తగ్గటానికి దారితీసిందని పరిశోధకులు తెలిపారు.
Climate change may be reducing fish weight in oceans, study findshttps://t.co/mvsIOcA24O pic.twitter.com/mFILHuuVBD
— News Bulletin (@newsbulletin05) February 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 29, 2024 09:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

