ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఓ 17 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్‌ పూల్‌ (Swimming Pool) నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మీరట్‌ (Meerut)లో శుక్రవారం చోటు చేసుకుంది.సివల్ఖాస్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఫ్రెండ్స్‌తో కలిసి ఈత కొట్టేందుకు స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగాడు. కాసేపు సరదాగా కొలనులో ఈతకొట్టిన బాలుడు బయటకు వచ్చాడు. గట్టుపై అటూఇటూ తిరిగాడు. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలి నేలపై పడిపోయాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. వీడియో ఇదిగో, డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడంతో జాంబీస్‌లా మారిన పంజావ్ వాసులు, రోడ్డు మీద నడవలేక నానా అవస్థలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)