తమిళనాడులో తిరుచ్చిలోని కొల్లిడం వంతెన కింద ఓ వ్యక్తి పుల్లుగా తాగి నిద్రపోయాడు.నిద్ర లేచి చూసే సరికి తను నీటి ప్రవాహంలో చిక్కుకుపోయాడు.మెట్టూరు డ్యాం నుంచి ముక్కంబు రెగ్యులేటర్‌కు ఇన్‌ఫ్లో 1.2 లక్షల క్యూసెక్కులకు మించి పెరగడంతో పిడబ్ల్యుడి బుధవారం రాత్రి వరద గేట్లు ఎత్తి కొల్లిడాంలోకి నీటిని విడుదల చేసింది. దీంతో నీటి మట్టం పెరగడంతో మందుబాబు చిక్కుకుపోయాడు.  వీడియో ఇదిగో, భారీ వరదలకు 5 సెకండ్లలో కుప్పకూలిన భారీ భవనం, పార్వతీ నదిలో కొట్టుకుపోయిన భవన శిథిలాలు

ఉదయం 6 గంటల ప్రాంతంలో అతన్ని మార్నింగ్ వాకర్స్ గమనించారు. శ్రీరంగం అగ్నిమాపక కేంద్రాన్ని అప్రమత్తం చేశారు. స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ఎల్‌.సగయరాజ్‌, ప్రత్యేక అగ్నిమాపక అధికారి ఎస్‌.గణేశన్‌, అగ్నిమాపక సిబ్బంది సి.అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని అగ్నిమాపక సిబ్బంది సేఫ్టీ రోప్‌లను ఉపయోగించి శశికుమార్‌ను రక్షించారు. ఆ వ్యక్తిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బందికి దాదాపు 45 నిమిషాల సమయం పట్టింది. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)