Newdelhi, Aug 21: జమ్మూకశ్మీర్‌లోని (Jammukashmir) లఢఖ్ (Ladakh) లో శనివారం ఓ ఆర్మీట్రక్కు (Army Truck) లోయలో పడి 9 మంది జవాన్లు అమరులయ్యారు. అమరులైన జాబితాలో తెలంగాణ వాసి కూడా ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తంగళ్లపల్లి పంచాయతీ పరిధిలోని తిర్మన్ దేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్ (29) ఈ ప్రమాదంలో అమరులయ్యారు. చంద్రశేఖర్ 2010లో ఆర్మీలో చేశారు. 2017లో కక్లూరుకు చెందిన లాస్యను వివాహం చేసుకున్నారు. వీరికి వర్షిత్ (4) అనే బాబు, సహస్ర అనే రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ ఏడాది మార్చి 17న గ్రామానికి వచ్చిన చంద్రశేఖర్ సెలవుల అనంతరం ఏప్రిల్ లో తిరిగి వెళ్లారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)