సంపూర్ణ సూర్యగ్రహణం 2024: ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం (Solar Eclipse) ఇవాళ ఏర్పడనుంది. అయితే నేటి సూర్య గ్రహణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం, ఏప్రిల్ 8, 2024న రాత్రి సమయంలో గ్రహణ ఏర్పడనుంది. భారత్‌ ఈ సంపూర్ణ సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేదు. అయితే చూడాలనుకునేవాళ్లకు ఆన్‌లైన్‌లో వీక్షించే అవకాశం ఉంటుంది. నాసా స్పేస్ ఏజెన్సీ యూట్యూబ్‌ అఫీషయిల్‌ ఛానెల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10గం:30ని. ప్రారంభించి, అర్ధరాత్రి 1గం:30ని. వరకు లైవ్‌ ఇవ్వనుంది.  54 సంవత్సరాల తర్వాత నేడే సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం, దాదాపు ఐదుగంటల 25 నిముషాలు పాటు కనువిందు చేయనున్న గ్రహణం, ఎలా చూడాలంటే..

Here's Nasa Link

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)