Newdelhi, Sep 25: ఓ డాక్టర్ (Doctor) చేసిన నిర్వాకం కారణంగా ఆసుపత్రిలో (Hospital) చల్లదనాన్ని భరించలేక ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) షామ్లి జిల్లాలో ఓ ప్రైవేట్ క్లినిక్‌లో జరిగిందీ ఘటన. శనివారం రాత్రి నిద్రపోయే ముందు డాక్టర్ నీతూ గదిలోని ఏసీ పెంచారు. తెల్లారి చూస్తే శిశువులు ఇద్దరూ మృతి చెంది కనిపించినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ నీతూను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. నిందితుడు దోషిగా తేలితే కఠిన చర్యలు తప్పవని అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్వని శర్మ హెచ్చరించారు.

Comments On Hindu Gods: హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో కామెంట్స్.. యూపీలో పదో తరగతి విద్యార్థిని రిమాండ్ హోంకు పంపిన పోలీసులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)