యూపీలో తాగిన మత్తులో ఇద్దరు యువతులు పబ్బులో రెచ్చిపోయి యువకుడిపై దాడి చేసి చితకబాదారు. అతడు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా పట్టించుకోకుండా కొట్టారు. ఇద్దరిలో ఒక యువతి పబ్బు ఎంట్రెన్స్‌ డెకరేషన్‌లోని పూలకుండి తీసుకొని మరీ యువకుడిపై విరుచుకుపడింది.పరిస్థితి చేయిదాటిపోతుందని భావించి అక్కడున్న బౌన్సర్ వచ్చి ముగ్గురినీ విడదీశాడు. అనంతరం ఆ ఇద్దరమ్మాయిలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)