హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నవాబ్ సాహెబ్ కుంట నిండిపోయి ఉప్పొంగింది. అది అసలే లోతట్టు ప్రాంతం కావడంతో రోడ్లపై నీళ్లు ప్రవహించాయి. ఈ క్రమంలో ఆదిబా హోటల్ ముందు ఒకదానిపై మరొకటి పెట్టిన రెండు పెద్ద బిర్యానీ గిన్నెలు కొట్టుకుపోతుండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టారు.బిర్యానీ గిన్నెలు కొట్టుకుపోతున్నాయి.

ఎవరికో బిర్యానీ ఆర్డర్ అందక డిసప్పాయింట్ అయిఉంటారు. ఈ బిర్యానీ గిన్నెలు ఎవరి ఇంటికి చేరుతాయోగానీ వారికి మాత్రం పండుగే...” అంటూ సదరు వ్యక్తి కామెంట్ పెట్టారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇదో సరికొత్త హోం డెలివరీ సర్వీసులా ఉంది’ అంటూ కొందరు.. ‘ది గ్రేట్ ఎస్కేప్’ అంటూ మరికొందరు. ‘బిర్యానీ దొరికినోడికి ఫుల్లు పండగే..’ అంటూ మరికొందరు కామెంట్లు పెట్టేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)