ముంబై శివార్లలోని ఓ బార్ లో ముగ్గురు యువతులు లేట్ నైట్ పార్టీ చేసుకున్నాక వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో పోలీసులపైనే దాడి చేశారు.ముంబైలోని విరార్ ప్రాంతంలో ఉన్న గోకుల్ టౌన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బార్ అండ్ రెస్టారెంట్ బయట ముగ్గురు యువతులు హంగామా చేస్తున్నారంటూ కొందరు స్థానికులు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. పెళ్లి చేసుకోలేదని బాలిక తల నరికి తీసుకుని పారిపోయిన యువకుడు, కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన

కానీ నిషా తలకెక్కడంతో ఆ యువతులు పోలీసులతో తొలుత వాగ్వాదానికి దిగారు. ఇష్టం వచ్చినట్లుగా వారిని దుర్భాషలాడారు. ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ చెయ్యి కొరకడమే కాకుండా ఆమె యూనిఫాంను చించేశారు. మరో కానిస్టేబుల్ తలపై బకెట్ తో బాదారు. అలాగే అతని చేతినీ కొరికారు. నిందితులను కావ్య, అశ్వని, పూనంగా గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)