ముంబై మీరా రోడ్డుకు చెందిన 38 ఏళ్ల గృహిణి పొరపాటున ఒక ఖాతాలొ కాకుండా మరో ఖాతాలో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) ద్వారా రూ. 7 లక్షలు చేసింది. అయితే పొరపాటు తెలుసుకునే లోపే జరగాల్సింది జరిగిపోయింది. వెంటనే బ్యాంకుకు వెళ్లగా వారు మాకు సంబంధం లేదని తేల్చేశారు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుజిత్‌కుమార్ గుంజ్కర్ మరియు PSI ప్రసాద్ షెనోల్కర్ నేతృత్వంలోని సైబర్ క్రైమ్ సెల్‌ బృందం వెంటనే రెండు బ్యాంకుల యాజమాన్యంతో చర్చలు జరిపింది.

రూ. 7 లక్షలు పొందిన వ్యక్తి ఆ మొత్తం తనకు లాటరీ ద్వారా తగిలిందని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. పోలీసులు ఆధారాలు చూపమని చెప్పడంతో అతడు దాన్ని నిరూపించలేకపోయాడు.అనంతరం పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఆ మొత్తాన్ని ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. ఈ విషయాన్ని సైబర్ క్రైం పోలీసులు ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)