ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఒక వీడియో నెటిజన్లకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ వీడియోలో.. ముగ్గురు పిల్లలు రైల్వే ట్రాక్స్ మీద కనిపిస్తున్నారు.ఒక పిల్లాడు ఒక పక్కగా నిలబడి ఉండగా.. ఇద్దరు పిల్లలు పట్టాల మధ్యలో నడుస్తున్నారు. రెండు వేరు వేరు ట్రాక్‌ల మధ్యలో ఒక పిల్లాడు ఉండగా.. రైలు వచ్చింది. అదే సమయంలో కనీసం వెనక్కు తిరిగి కూడా చూడని మూడో పిల్లాడు గబగబా నడుస్తూ పక్కనే ఉన్న పట్టాల మీదకు వచ్చేశాడు. రైలు కూడా అదే పట్టాలపై వస్తుండటంతో అతని పని అయిపోయిందనే అనిపిస్తుంది.

కానీ అదృష్టం బాగుండి.. అడుగుల దూరంలో ఆ పిల్లాడు తప్పించుకున్నాడు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేసిన ‘‘మెట్రోలింక్స్’’ హ్యాండిల్.. పిల్లలతో రైలు భద్రత గురించి చర్చించాలని తల్లిదండ్రులను కోరింది. నెట్టింట ఈ వీడియో వైరల్ అవడంతో చాలా మంది కూడా పిల్లల అజాగ్రత్త గురించి మాట్లాడగా.. మరికొందరు మాత్రం గార్డ్ రెయిల్స్ ఉంటు బాగుండేదని రైల్వేలకు సూచనలిచ్చారు.ఈ ఘటన టొరంటోలో జరిగినట్లు సమాచారం. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. చాలా మంది ఆశ్చర్యపోయారు.

.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)