ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగిన వివాహ వేడుకలో వధువు... వరుడి చెంప చెళ్లుమనిపించింది. పెళ్లి మండపంలో వరువు.. వధువు మెడలో పూల దండ వేవబోతుండగా.. ఆమె ఒక్కసారిగా పెళ్లికొడుకు చెంపపై కొట్టింది. ఏకంగా మూడు, నాలుగు సార్లు చెంపవాయిస్తూనే ఉంది. దీంతో అక్కడున్నా వారంతా షాకయ్యారు. అనంతరం ఆమె పెళ్లి మండపం దిగి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. పెళ్లిలో వరుడు మద్యం సేవించి ఉండటం వల్లే ఆమె ఇలా చేసిందని ట‍్విట్టర్‌ యూజర్‌ తెలుపగా.. వధువుకు ఈ పెళ్లి ఇష్టంలేకనే అలా చేసిందని ఆమె బంధువులు చెబుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)