అగ్రరాజ్యం అమెరికాలోని బోస్టన్‌ శివార్లలోని రైలు వంతెనపై మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొంతమంది భయంతో కిటికీల గుండా తప్పించుకోగా, మరికొంత మంది వంతెన కింద ఉన్న నదిలోకి దూకేసినట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటన పై దర్యాప్తు చేసిన మసాచుసెట్స్ బే ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ కీలక విషయాలు వెల్లడించింది.వెల్లింగ్‌టన్, అసెంబ్లీ స్టేషన్‌ల మధ్య ఉన్న వంతెన మీదుగా ప్రయాణిస్తున్న ఆరెంజ్ లైన్ రైలు దాని హెడ్ కార్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడినట్లు పేర్కొంది. ఐతే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)