రోడ్డు మీద ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో వీధి చివర మలుపులో బస్సు టర్న్ అవుతున్న సమయంలో ఓ బైకర్ వేగంగా దూసుకువచ్చాడు. బస్సును ఢీకొట్టడంతో పాటు చక్రాల కింద పడిపోయాడు. బస్సు డ్రైవర్ అప్రమత్తత వలన అతను స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అప్పటికే బస్సు అతన్ని రెండడుగుల దూరం వరకు దొర్లించుకుంటూ వెళ్లింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కాని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో తెలియజేస్తుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)