ఇంటర్నెట్లో షాకింగ్ వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ మనిషి నడుస్తూ ఉండగానే ఫుట్‌పాత్‌ కుంగిపోయింది. రెడ్డిట్‌లో బుధవారం పోస్ట్‌ అయిన వీడియో కొద్దొ గంటల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒక వ్యక్తి రోడ్డు పక్కగా ఉన్న షాపులోకి వెళ్లేందుకు దాని ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై నడిచాడు. అయితే అతడు పాపు మెట్లపై కాలు పెట్టిన వెంటనే ఆ ఫుట్‌పాత్‌ కుంగిపోయింది. దాని కింద లోతులో డ్రైనేజ్‌ ఉంది. దీంతో ఆ వ్యక్తి ఈ షాక్‌ నుంచి చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాడు. తనకు లక్కీ డే అని అనుకున్నాడు.ఫుట్‌పాత్‌ కుంగిపోవడం చూసి ఆ షాప్‌లోని వ్యక్తులు కూడా హడావుడిగా బయటకు వచ్చారు. డ్రైనేజీలోకి కుంగిన ఫుట్‌పాత్‌ను పరిశీలించారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అన్నది తెలియలేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)