కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు ఫగ్గన్‌సింగ్ కులస్తే రోడ్డుపక్కన మక్కకంకులు బేరమాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు పక్కన ఓ కుర్రాడు కంకులు కాలుస్తుండడం చూశాడు. స్వయంగా కారు దిగి వచ్చి కుర్రాడితో మూడు కంకులు కాల్చుకున్న తరువాత బేరమాడడం మొదలెట్టారు. ఒక్క కంకి ఎంత? అని కేంద్ర మంత్రి అడగ్గా..రూ. 15 అని కుర్రాడు సమాధానమిచ్చాడు.
దీంతో మంత్రి ఆశ్చర్యపోయారు. ఇంత రేటా? అని ప్రశ్నించారు. ‘ఒక్కోటి రూ. 15..మొత్తం మూడు కంకులకు రూ. 45 ఇవ్వాలా?’ అని అడిగారు. దీనికి ఆ కుర్రాడు.. ‘కంకి స్టాండర్డ్ ధర రూ. 15.. మీకు కారు ఉందని ఆ రేటు చెప్పలేదు’ అంటూ కేంద్ర మంత్రికి ఆ కుర్రాడు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను కేంద్రమంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘ఈ రోజు సియోని నుంచి మాండ్లాకు వెళ్తున్నాను. స్థానిక మక్కకంకి రుచి చూశాను. మనమందరం స్థానిక రైతులు, దుకాణదారుల నుంచి ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలి. ఇది వారికి ఉపాధిని ఇస్తుంది’ అని క్యాప్షన్ ఇచ్చారు.
आज सिवनी से मंडला जाते हुए। स्थानीय भुट्टे का स्वाद लिया। हम सभी को अपने स्थानीय किसानों और छोटे दुकानदारों से खाद्य वस्तुओं को ख़रीदना चाहिए। जिससे उनको रोज़गार और हमको मिलावट रहित वस्तुएँ मिलेंगी। @MoRD_GoI @BJP4Mandla @BJP4MP pic.twitter.com/aNsLP2JOdU
— Faggan Singh Kulaste (@fskulaste) July 21, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)