పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మహిళా పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపణలు చేసిన సంగతి విదితమే. మహిళా పోలీసులతో ఆయన మీరు మహిళా అధికారి. నన్ను టచ్ చేయొద్దు.. పురుష సిబ్బందిని పిలవండి’ అని వారించారు. తాజాగా సువేందు అధికారి వ్యాఖ్యలకు టీఎంసీ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు.
టీఎంసీ శాసన సభ్యుడు ఇద్రిస్ అలీ ‘ఈడీ, సీబీఐ నా శరీరాన్ని తాకలేవు.. నేను మగవాడిని’ అని రాసి ఉన్న కుర్తా ధరించి అసెంబ్లీ లోపలికి వెళ్లాడు. టీఎంసీ ఎమ్మెల్యే ఇలాంటి డ్రెస్ ధరించి అసెంబ్లీకి ఎందుకు వచ్చారని మీడియా ప్రశ్నించగా.. ‘తనను సీబీఐ, ఈడీ తాకలేవని భావించే ఓ బీజేపీ నేత అన్నారు’ అంటూ సువేందు అధికారిని ఉద్ధేశిస్తూ చురకలంటించారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ‘నబానా ఛలో’ పేరుతో బీజేపీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే.
Watch # Inside the Assembly house TMC MLA Idris Ali gets in wearing kurta having specially stitched on it CBI and ED Cannot touch me . pic.twitter.com/7248pEfJzG
— Syeda Shabana (@ShabanaANI2) September 22, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)