యూట్యూబ్ లో బైక్ స్టంట్ వీడియోలు చూసే వారికి తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ అనే యువకుడి వీడియోలు సుపరిచితమే. బైక్ పై వీరోచిత స్టంట్లు, రోడ్ ట్రిప్ లతో పాప్యులారిటీ సంపాదించుకున్నాడు. యూట్యూబ్ లో అతడికి 45 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇటీవల చెన్నై-వేలూరు హైవేపై ప్రయాణిస్తూ స్టంట్ చేయబోయిన వాసన్ బైక్ ను నియంత్రించలేక చేయి విరగ్గొట్టుకున్నాడు. ఆ సమయంలో అతడు రేస్ సూట్, హెల్మెట్ ధరించి ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వీడియోను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు వాసన్ పై కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. కాంచీపురం కోర్టు అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో వాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, మద్రాస్ హైకోర్టు కూడా అతడిపై ఏమాత్రం కనికరం చూపలేదు. ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తున్న అతడు గుణపాఠం నేర్చుకోవాల్సిందేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. యూట్యూబ్ చానల్ మూసేయాలని వాసన్ ను ఆదేశించింది. ఆ తర్వాతే కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. ప్రస్తుతం అతడు గాయాలతో ఉన్నందున తగిన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు న్యాయస్థానం నిర్దేశించింది. బైక్ ముందు చక్రాన్ని గాల్లోకి లేపి రైడింగ్ చేసే ప్రయత్నంలో వాసన్ రోడ్డు పక్కన పడిపోయాడు. అతడి బైక్ కూడా ధ్వంసమైంది

YouTuber who was injured while doing stunt, Madras High Court ordered to close YouTube channel

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)