గతేడాది టెస్టుల్లో వరుస పరజయాలతో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కొత్త సంవత్సరంలో అద్భుతమైన గెలుపుతో విజయగర్జన చేసింది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించి సరికొత్త చరిత్ర లిఖించింది. కివీస్ గడ్డపై తమ మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసి సగర్వంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆరంభించింది. ఈ నేపథ్యంలో మొమినల్ హక్ సారథ్యంలోని జట్టు సంబరాలు అంబరాన్నంటాయి.
డ్రెస్సింగ్ రూంలో విజయాన్ని ఆస్వాదిస్తూ.. ‘‘ఏదో ఒకరోజు మేము అధిగమించి తీరతాం’’ అన్న అర్థంతో కూడిన పాటను పాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను బంగ్లాదేశ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇబాదత్ హొసేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
Bangladesh Team dressing room celebrations following the historic win at Mount Maunganui.#BCB #cricket #BANvsNZ pic.twitter.com/78pGFQ30wP
— Bangladesh Cricket (@BCBtigers) January 5, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)