చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్‌ ధోని మోకాలికి ఇవాళ (జూన్‌ 1) జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్‌ వెల్లడించారు. ముంబైలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో నేటి ఉదయం ధోనికి సర్జరీ జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ధోని ఫిట్‌గా ఉన్నాడని, మరో రెండు రోజుల పాటు అతను ఆసుపత్రిలోనే ఉంటాడని పేర్కొన్నారు.సర్జరీ అనంతరం తాను ధోనితో మాట్లాడానని.. శస్త్రచికిత్స గురించి వివరించలేను కానీ అది కీ-హోల్ ఆపరేషన్‌ అని మాత్రం చెప్పగలనని వివరించారు.

PTI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)